
భిక్నూర్ మండల తాసిల్దార్ గా నిర్మల్ ఆర్డిఓ కార్యాలయంలో డీఏఓగా విధులు నిర్వహించిన శివ ప్రసాద్ బదిలీ పై వచ్చి తాసిల్దార్ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు విధులు నిర్వహించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. బదిలీపై వచ్చిన ఎమ్మార్వో శివప్రసాద్ ను కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించారు.