పౌర పోలీస్ పై అవగాహన అవసరం : ఎస్.హెచ్.ఒ రాజేష్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థులకు కూడా పౌర పోలీసింగ్ పై అవగాహన ఉండాలని ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ రాజేష్ కుమార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పౌర పోలీసింగ్ పై అవగాహన కల్పించారు. నేరం,చట్టం అనే అంశాలు కనీస అవగాహన అవసరమని ఆయన తెలిపారు.చట్టాలపై అవగాహన ఉన్నప్పుడు న్యాయం పొందటానికి అవకాశాలు దోహదపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సెక్షన్లు, వాటి ప్రాముఖ్యత, కోర్టు ద్వారా న్యాయం ఎలా పొందవచ్చో వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్ర, తీసుకుంటున్న చర్యలు,ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరసింహారావు, పత్తేపరపు రాంబాబు, అప్పారావు, బాలస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.