బీఆర్‌ఎస్‌కు షాక్‌

– కాంగ్రెస్‌లో చేరిన బీఅర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు
నవతెలంగాణ-నూతనకల్‌
బీఆర్‌ఎస్‌ మండల నాయకులు అనివార్య కారణాలవల్ల నలిగిపోతూ వివిధ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు,ఉద్యమకారులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి మందుల సామెల్‌ సమక్షంలో శనివారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి మాజీమంత్రి రాంరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన వారు మాట్లాడారు. బీఅర్‌ఎస్‌ మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించలేదన్నారు. కొన్ని కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహిస్తూ అగౌరపరిచారని ఆరోపించారు.నాటి ఉద్యమం నుండి సుపరిచితుడైన సామేల్‌ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కషి చేస్తామన్నారు.కాంగ్రెస్‌లో చేరిన వారిలో మండలకేంద్రానికి చెందిన ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి,బిక్కుమల్ల సర్పంచ్‌ బొల్లేపల్లి అశోక్‌,సోములతండా ఎంపీటీసీ సజ్జన్‌నాయక్‌, తో పాటు అనేకమంది ఉద్యమకారులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెంకష్ణారెడ్డి,దరిపల్లి వీరన్న, మేడేపల్లి అశోక్‌, జూలూరి కేశవాచారి తదితరులు పాల్గొన్నారు.