సిద్దిపేటలో బీఆర్ఎస్ కు షాక్

– సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సిద్దిపేట బిఆర్ఎస్ కౌన్సిలర్లు
నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేటకు చెందిన 7వ వార్డ్ కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ రియాజుద్దీన్, 37 వ వార్డు కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మి ఆనంద్  లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి కొండా సురేఖ పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మొదటిసారిగా సిద్దిపేట పట్టణానికి చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తమతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఎప్పుడైనా, ఏ అవసరమైన తనను నేరుగా కలవచ్చని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.