
కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఇరుగురాల శేఖర్ కు ఆ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు సోమవారం షాకాజ్ నోటీసును కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చొప్పరి శేఖర్ పై ఎందుకు అకారణంగా చేయి వేసుకొన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పెద్దల దృష్టికి వెళ్ళింది. వారి ఆదేశాల మేరకు ఎందుకు పెంచికల్ పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నుండి తొలిగించవద్దో వివరణ ఇవ్వాలని, షాకాజ్ నోటీసు జారీ చేశారు. ఇందుకు సంబందించిన వివరణ 24 గంటల్లో ఇవ్వాలని, లేని యెడల తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసులో వెల్లడించారు.