కాశ్మీర్‌లో షూటింగ్‌

Shooting in Kashmirనాని నటిస్తున్న నూతన చిత్రం ‘హిట్‌ : ది థర్డ్‌ కేస్‌’. డాక్టర్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌ పోస్టర్‌ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. క్రిస్మస్‌ విషెస్‌ తెలియ జేస్తూ మేకర్స్‌ ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇంటెన్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు టాకీని కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న థియేటర్లలోకి రానుంది. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలను, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, డీవోపీ: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: మిక్కీ జె మేయర్‌, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌ ఆర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ వెంకటరత్నం (వెంకట్‌), లైన్‌ ప్రొడ్యూసర్‌: అభిలాష్‌ మాంధదపు.