
నవతెలంగాణ – తాడ్వాయి: మండలంలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ ఫోక్ సాంగ్ హంగామా ప్రొడక్షన్ ఆధ్వర్యంలో చలో మేడారం ఫోక్ సాంగ్ చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావును, డైరెక్టర్ రఘు జాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.కె బాజీ, క్యాస్టింగ్ టోనీ కిక్, నిహాల్ గంగావత్ లను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ప్రొడక్షన్ మేనేజర్ కత్తి రాజ్ కుమార్ (పండు) మాట్లాడుతూ మేడారం మహా జాతర ఆదివాసి సాంప్రదాయాలు ప్రపంచ స్థాయిలో అందరికి తెలిసే విధంగా ఉండడానికి ఫోక్ సాంగ్ చిత్రీకరించినట్టు తెలిపారు.
దీనికి పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. జాతరలో వైద్య బృందాలను ఏర్పాటు చేసి అన్ని రకాల మెడిసిన్ లను అందజేస్తామని తెలిపారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, అంతేకాకుండా హెచ్ఐవి క్యాన్సర్ బాధిత రోగులకు మా కంపెనీ ద్వారా ఫ్రీగా వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ప్రొడక్షన్ మేనేజర్ కత్తి రాజ్ కుమార్ (పండు), పూజారి సిద్దబోయిన రానా రమేష్, హంగామా చలో మేడారం డైరెక్టర్ రఘు జాన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.కె బాజీ లయారిక్ కందికొండ, క్యాస్టింగ్ టోనీ కిక్, నిహల్ గంగావతి తదితరులు పాలుగొన్నారు.