కోదాడ కోర్టులో షార్ట్‌సర్క్యూట్‌

కోదాడ కోర్టులో షార్ట్‌సర్క్యూట్‌– బీరువాలోని పత్రాలు దహనం
నవతెలంగాణ-కోదాడరూరల్‌
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోర్టులో అగ్నిప్రమాదం విషయం మంగళవారం వెలుగుజూసింది. బీరువాలో ఉన్న కోర్టుకు సంబంధించిన వివిధ పత్రాలు కాలిపోయాయి. విద్యుత్‌బోర్డులో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బోర్డుకు ఆనుకునే బీరువా ఉండటంతో, మంటలు అంటుకొని, లోపల ఉన్న ట్రై పూర్తిగా కాలిపోయింది. పమాదం జరిగిన తీరును ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌.శ్యాంసుందర్‌, పట్టణ సీఐ రాము పరిశీలించారు. మూడ్రోజులు కోర్టు సెలవులు కావడంతో సిబ్బంది మంగళవారం గమనించారు. అంతేగాకుండా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగుతుండటంతో అటువైపు పరిశీలించకపోవడంతో ఇలా జరిగి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.