నవతెలంగాణ- భువనగిరి : జిల్లా విద్యా శాఖ మరియు జిల్లా బాలల సంక్షేమ శాఖ సంయుక్త ఆద్వర్యములో జనవరి 24వ తేది రోజున జాతీయ బాలిక దినోత్సవం సంధర్భముగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ,ఇంటర్మీడియట్ కళాశాలలలో బాలికల హక్కులు, సంక్షేమం, బాల్య వివాహాల నిషేదం, బాల కార్మిక నిర్మూలన, మానవ అక్రమ రవాణా అంశాలపై చిన్న వీడియో ఫిల్మ్ స్కిట్ ,సమూహ చర్చ కార్యాక్రమాలపై పోటీ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, కార్యదర్శి అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. దశరథ రామయ్యలు తెలిపారు. ఇట్టి కార్యాక్రమనిర్వహనలపై సంస్థ కార్యదర్శి మరియు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. దశరథ రామయ్య సి. డబ్ల్యూ. సి అధ్యక్షురాలు జయశ్రీ, జిల్లా విధ్యాశాఖాధికారి నారాయణ రెడ్డి , జి.సి.డి.ఒ నిర్మల జ్యోతి, డి. సి. పి. ఒ సైదులులతో చర్చించి తగు సూచనలు చేశారు.