– ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్ సాయన్న
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సముదాయంలో ఉన్న ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2023-2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు షార్ట్ మెమోలు, టీసీలు తీసుకువెళ్లాలని ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్ సాయన్న శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.షార్ట్ మెమోలు, టిసి లు అధ్యయన కేంద్రంలో వున్నాయని, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వాటిని తీసుకువెళ్లవచ్చని సెంటర్ కో ఆర్డినేటర్ పసుపుల సాయన్న తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక మంది ఉన్నత స్థాయిలు పొందడానికి అవకాశాన్ని కల్పిస్తున్న కమ్మర్ పల్లి అధ్యయన కేంద్రాన్ని మారుమూల ప్రజల సౌకర్యార్థం కొనసాగిస్తున్నామని తెలియచేశారు.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.