పది వేదికల్లో పొట్టి ప్రపంచకప్‌

న్యూఢిల్లీ : 2024 టీ20 ప్రపంచకప్‌ తేదిలను ఐసీసీ ప్రాథమికంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కరీబియన్‌, యుఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యం అందిస్తున్న ఈ పొట్టి ప్రపంచకప్‌ పది స్టేడియాల్లో జరుగనుంది. జూన్‌ 4న ఆరంభ మ్యాచ్‌తో మొదలై, జూన్‌ 30న టైటిల్‌ పోరుతో ముగియనుంది. దీనిపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో 2024 టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.