మల్హర్ లో పెట్రోల్ కొరత.?

– ఇబ్బందులు పడుతున్న వాహన యజమానులు 
నవ తెలంగాణ- మల్హర్ రావు: మండలంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి మండల వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని తాడిచెర్ల,కొయ్యుర్ గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోలు, డీజిల్ కటకట ఏర్పడి వారం దాటుతున్న పెట్రోల్ బంకుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని మండల ద్విచక్ర, ఇతర వాహనదారులు  వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బ్లాక్ అమ్ముతున్న పెట్రోల్, డీజిల్ లీటర్ పై అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకు తీసుకుంటున్నట్లుగా వాహన యజమానులు వాపోతున్నారు. అసలే పొలాల కోతలు ప్రారంభం కావడంతో వరికోత మిషన్, ట్రాక్టర్ల యజమానులు మంథని, భూపాలపల్లి పట్టణాల నుంచి డీజిల్ తెచ్చుకుంటున్న పరిస్థితి.