– ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంతో బహిర్గతం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాల్లో తీవ్ర సిబ్బంది కొరత ఉన్నది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంతో ఈ విషయం వెల్లడైంది. ఫ్యాకల్టీ సభ్యుల 75 శాతం హాజరును నిర్వహించటంలో విఫలమైనందుకు గానూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గత నెలలో భారత్‌లోని దాదాపు సగం వైద్య కళాశాలలకు వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత తీవ్రం నోటీసులు పంపింది. తక్కువ వైద్య కళాశాలలు కలిగిన రాష్ట్రాలు కూడా అత్యధిక హాజరులేమిని కలిగి ఉండటం గమనార్హం. అపెక్స్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్‌లోని వర్గాలు ఆన్‌లైన్ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ సిస్టమ్‌పై నివేదించిన హాజరులో కొరత చాలా ఎక్కువగా ఫ్యాకల్టీ కొరత కారణంగానే ఉన్నదని పేర్కొనటం గమనార్హం. ”అధ్యాపకులు హాజరును ఆన్‌లైన్‌లో గుర్తించడం తప్పనిసరి చేయబడింది. 2020 నుంచి నిబంధనలు ఉండగా, గతేడాది నుంచి అమలు చేయడం ప్రారంభమయ్యాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉంటే వారు ఎందుకు హాజరుకారు. కళాశాలలకు అవసరమైన అధ్యాపకులు లేకపోవటం కారణంగానే హాజరు తక్కువగా ఉన్నది”అని ఒక అధికారి తెలిపారు. అయితే, అధ్యాపకుల సంఖ్యలో కొరత వాస్తవంగా ఉంటే.. కళాశాలలు ఈ లోపాన్ని తీర్చడానికి కఠినమైన సమయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు