ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత.?

– మండల వ్యాప్తంగా 38 పోస్టులు ఖాళీలు
– ప్రస్తుత బదిలీలతో మోడల్ స్కూల్లో  భారీగా ఖాళీలు.
– బోధకులు లేక నష్టపోతున్న విద్యార్థులు
నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల భర్తీ  జరగడం లేదు. బదిలీలు, పదోన్నతులతో మండలం నుంచి దాదాపు 50 మంది వెళ్లిపోగా, మారుమూల ప్రాంతంలో పని చేసేందుకు కొత్తవారు ఆసక్తి చూపడంతో వెనకడుతున్నట్లుగా సమాచారం  గతంలో విద్యార్థులు నష్టపోకుండా విద్యావలంటీర్లను నియమించేవారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అకాడమిక్ ఇన్ స్ట్రక్షర్లను నియామకం ఇప్పటివరకు పూర్తికాలేదు. మరోవైపు డీఎస్సీ నియామక ప్రక్రియ సైతం పూర్తికాకపోవడంతో కొత్త టీచర్లు ఎప్పుడు ఉద్యోగాల్లో చేరుతారనే దానిపై స్పష్టత కరువైంది.
డీఎస్సీ ద్వారా 38 పోస్టులు భర్తీ…
మండల వ్యాప్తంగా మొత్తం 35 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 27, ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు,ఉన్నత పాఠశాలలు 5, ఓం మోడల్ స్కూల్, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలున్నాయి. 2024- 25 విద్యా సంవత్సరంలో 1856 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
మండలంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు 126 ఉండగా, ప్రస్తుతం 26 పోస్టులు ఖాళీగా,మోడల్ స్కూల్లో 17 మంది ఉపాధ్యాయు పోస్టులకు 8 ఖాళీగా, కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో 13 మందికి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఇటీవల బదిలీలు, పదోన్నతులతో చాలామంది స్కూల్ గ్రేడ్ టీచర్లు (ఎన్జీటీ) స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)గా పదోన్నతి పొందారు. ఫలితంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.
మోడల్ స్కూళ్లలో భారీగా ఖాళీలు..
రాష్ట్ర ప్రభుత్వం 2013లో మోడల్ స్కూళ్లను ప్రారంభించగా అప్పటి నుంచి ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు బదిలీలు జరగలేదు..11 ఏళ్ల తర్వాత జరిగిన బదిలీలతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు దాదాపు మొత్తం మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. 14 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు, అధ్యాకులు బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు.పాఠశాలలో మొత్తం 17 పోస్టులకు ప్రస్తుతం 8 మంది మాత్రమే ఉన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇలా… 
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగు ణంగా టీచర్లను నియమించాలని నిబంధన లు చెబుతున్నాయి. విద్యార్థులు 19లోపు ఒక టీచర్, 20 నుంచి 60 వరకు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 30 వరకు ఉంటే ముగ్గు రు. 91 నుంచి 120 వరకు నలుగురు, 121 నుంచి 150 వరకు ఐదుగురు ఎస్జీటీలు, ఒక హెచ్ఎం, 201 నుంచి 240 వ రకు విద్యార్థు లు ఉంటే హెచ్ఎం, ఆరుగురు ఎస్జీటీలు, 241 నుంచి 280 వరకు ఉంటే హెచ్ఎం, ఏడుగురు ఎస్జీటీలు, 281 నుంచి 320 వరకు ఎనిమిది మంది ఎస్జీటీలు, ఒకరు హెచ్ఎం, 321 నుంచి 360 వరకు ఉంటే తొమ్మిది మం ది ఎస్జీటీలు, ఒక హెచ్ఎం, 361 నుంచి 400 వరకు విద్యార్థులు ఉంటే పది మంది ఎస్జీటీలు, ఒక హెచ్ఎం ఉండాలి.ఎకనామిక్స్, టీజీటీ తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్ పోస్టులు ఖాళీగా మారాయి. విద్యా సంవత్సరం మధ్యలో బోధకులు వెళ్లిపోవడంతో చదువులపై ప్రభావం చూపుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బదిలీలతోనే ఖాళీలు…
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో మండలంలో  ఖాళీల సంఖ్య పెరిగింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.విద్యార్ధులు ఎక్కువ మంది ఉన్న చోటుకు ఉపాధ్యాయులను సర్దు బాటు చేస్తూ,తాత్కాలిక పద్ధతిలో మోడల్ స్కూల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.