మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను అందరికీ వర్తింపచేయాలని ధర్మసాగర్ మండల పార్టీ కోఆర్డినేటర్ కొత్త బండి బిక్షపతి అన్నారు. గురువారం ధర్మసాగర్ మండల్ యువ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నీ గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా తెలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకై చర్చించి ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీల పథకాలపై అర్హులైన ప్రజలకి అందివ్వాలని కోరడం జరిగిందన్నారు. అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సింగపురం ఇందిరాని హైదరాబాద్ లో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పలు అభివృద్ధి పనులపై చర్చించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కొత్తపల్లి బిక్షపతి ధర్మసాగర్ మండల్ మాజీ యువ నాయకులు బుల్లెట్ల వికాస్ రెడ్డి,మాజీ ఓబీసీ అధ్యక్షులు గంటి రాజకుమార్,గోదల ప్రశాంత్ నారాయణ గిరి ప్రవీణ్ కలవడం జరిగినది.