
– సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల నేలకోల్పి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందజేసి పలువురు విద్యార్థులు నేడు ఉన్నత స్థాయికి చేరుకున్నారని, 25 వసంతలు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపు కోవడం అభినందనీయమని సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, సదాశివ్ నగర్ ఎంపిడిఓ ఎం. సంతోష్ కుమార్ అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని జ్ఞాన వాగ్దేవి విద్యాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, సదాశివ్ నగర్ ఎంపిడిఓ ఎం సంతోష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో చేరి మంచి విద్య అభ్యసిస్తున్నరని, ఈ 25ఏళ్ళ లో ఎందరో చదువులు చదివి నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని, మంచి విద్య కు మారుపేరుగా ఈ విద్యాలయం నిలిచిందన్నారు. క్రమ శిక్షణతో, అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా విద్యాలయ యజమానులు ప్రత్యేక కృషి చేస్తున్నారని వారన్నారు. విద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యం పట్టుదల తో మంచి విద్య అందించారని కొనియాడారు. మండల కేంద్రంలోని ఎస్ ఎస్ అర్ ఆసుపత్రి వైద్యులు డీకోండ అనుదిప్ మాట్లాడుతూ ఎల్ కె జి లో జ్ఞాన వాగ్దేవి విద్యాలయం లో చేరి నేడు ఎంబిబిఎస్ డాక్టర్ అయ్యానని, నేడు చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని, కాని ఈ పాఠశాల నుండే ప్రారంభం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.అంతకు ముందు పలువురు విద్యార్థుల డ్యాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 26 ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా అటల పోటిలో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేత బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలోఅధ్యక్షులు సి హెచ్ గంగరాజయ్య, కార్యదర్శి అర్ రాధిక, కోశాధికారి ఆర్.గంగాధర్, ప్రిన్సిపాల్ బి. ఓంకార చారి, పాఠశాల కరస్పాండెంట్ తెలు గంగాధర్,వైస్ ప్రిన్సిపల్ ఎం. ప్రశాంత కుమార్, అద్యాపాకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.