ప్రజలకు అందుబాటులో ఉండాలి

should be accessible to the public– వైద్య సిబ్బంది సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలదించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సూచించారు. శుక్రవారం ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడిచెర్ల ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు, ఉప కేంద్రాల్లో సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. సమయ పాలన పాటించని వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మధ్యలో గుండె పోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ ద్వారా వారి శరీరంలో కొవ్వు శాతాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రోజువారీ రిజిస్టర్, ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్యాధికారి కొమురయ్య, వైద్యాధికారి శ్రీదేవి,పిఓ ప్రమోద్,డిపిఓ చిరంజీవి, డిడిఎం మధుబాబు,సిబ్బంది పాల్గొన్నారు.