కులం పేరుతో దూషించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో డిఎస్పీ జీవన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిశారు. ఇటీవల యువజన సంఘాల అధ్యక్షులు బాలశంకర్ కృష్ణపై కులం పేరుతో దూషించి, భయభ్రాంతులకు గురి చేసిన శ్యామల   ప్రశాంత్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న  చామల ప్రశాంత్ పై పోలీసులు వెంటనే స్పందించి చట్టపరంగా చర్యలతో పాటు రిమాండ్ చేయాల్సిందిగా విన్నవించారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు అల్లూరి భూమన్న, కార్యనిర్వాహన అధ్యక్షులు నల్గొండ నవీన్, నాయకులు చందాల రాజన్న, సందీప్ దాండియా, శశికాంత్, క్రాంతి కుమార్, ఈర్ల దయాకర్, గైని ప్రకాష్ ఉన్నారు.