
మోపాల్ మండలంలోని న్యాల్కల్ మరియు కులాస్పూర్ అంగన్వాడి కేంద్రాలలో కల్తీ ఆహారం పైన అంగన్వాడి సెంటర్ లోని తల్లులకు జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో ఆహార కల్తీ మరియు అయోడిన్ ఉప్పుని ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసే అంశంపై చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది . ఆహారం, కల్తీ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులు అందరూ చైతన్యవంతులు కావాలని ఆయన కోరారు .ఉప్పు, పప్పులు వంట నూనెను మొదలుకొని వివిధ రకాల అయోడిన్ ఉప్పు ప్లాస్టిక్ సంచులలో అమ్మకం జరుగుతుంది కావున మైక్రో ప్లాస్టిక్ కడుపులో చేరడంతో క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్ ప్యాకింగ్ వల్ల అయోడిన్ ఉప్పు లక్ష్యం వృధా అయిపోతుందనీ, ఉప్పు తయారీదారులు తాము ఉత్పత్తి చేసే ఉప్పును ప్లాస్టిక్ కవర్లలో తయారు చేయకుండా ఉండాలని ఆయన కోరారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ఒకవేళ ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేస్తే ఆ ప్లాస్టిక్ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ప్రమాణాలను ప్యాకెట్ పై ముద్రించాలని ఆయన అన్నారు. అలాగే వివిధ రకాల అయోడిన్ ఉప్పు తయారీ సంస్థలు నాసిరకం ప్లాస్టిక్ కవర్లలో ఉప్పు ప్యాకింగ్ చేయడం వల్ల చిన్న పిల్లలతో సహా అందరికి క్యాన్సర్ రావడానికి కారణం అవుతుందని తెలిపారు. అలాగే ప్యూరిఫైడ్ బియ్యం నిల్వలలో జాగ్రత్తలపై అంగన్వాడి కార్యకర్తలను చైతన్యవంతులు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు రాజుల రామనాథం ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, సూపర్వైజర్ జాకీరా అంగన్వాడీ టీచర్ రజిత ,బాలింతలు మరియు గర్భిణీలు ,తదితరులు పాల్గొన్నారు