ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి..

Should be aware of the right to vote.నవతెలంగాణ – క్రిష్ణా 

మండల కేంద్రంలో ఓటర్ల దినోత్సవాన్ని తహసీల్దారు బి వెంకటేష్ ఆద్వర్యంలో నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో గ్రామ పుర వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు, గ్రామ ప్రధాన కూడాలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు, ఓటు హక్కు ప్రాధాన్యతపై అధికారులు అవగాహన కల్పించారు,18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అర్హులందరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు, పాఠశాల విద్యార్థులకు రంగోలి పోటీలను నిర్వహించి ప్రశంస పత్రంతో పాటు బహుమతులను అందించారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బిఎల్వోలు, పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.