నవతెలంగాణ – గోవిందరావుపేట
ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఫిజియోథెరపీ కౌన్సిలర్ డాక్టర్ రోనివోని సమస్త అన్నారు. మంగళవారం మండలంలోని వసర గ్రామంలో సుందరయ్య నగర్ లో సేవా భారతి ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోనివోనిసిమస్ హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా సేవా భారతి ఆధ్వర్యంలో వయోజనులకు విద్యతోపాటు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రయాణాల సమయంలో బ్యాంకులలో దవాఖానాలో చదువు రాని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే అలాంటి పరిస్థితి ఎవరికీ రకూడదని సేవా భారతి ఆధ్వర్యంలో వయోజనులకు చదవడం రాయడం నేర్పుతున్నామని అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో చదువుకొని రాణిస్తూ కుటుంబ పరంగా చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ధి చెందిన పలు అంశాలను చూపిస్తూ వివరించారు. దీనిలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన ప్రాముఖ్యతను కూడా వివరిస్తున్నామని అన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు నియమాలు ఆహార పదార్థాలు రోగనిరోధక వ్యవస్థ తదితర అంశాలపై ఉదాహరణలతో వయోజనులకు వివరించారు. అనంతరం ఆర్ఎంపీ వైద్యులు శ్యాంబాబు వాయు నీటి ఆహార కలుషితాలు కల్తీల వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. సేవా భారతి కోఆర్డినేటర్ నల్ల ప్రవీణ్ మాట్లాడుతూ పెరటి తోటల్లో కూరగాయలను క్రిమిసంహారకాలు లేకుండా పండించుకుని తినడం వల్ల జరిగే ఉపయోగాలను వివరించడంతోపాటు ప్రతిరోజు కొన్ని అక్షరాలను పదాలను రాయడం చదవడం నేర్చుకోవాలని అందుకు సులభతరమైన పద్ధతులను నేర్పించారు. చదువు లేనివారు సమాజంలో ఎలా మోసపోతారు అనే ఉదాహరణలను వివరించారు. చదువు ప్రాముఖ్యతను గుర్తించి సేవా భారతి అందిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం వయోజనులందరికీ సేవా భారతి ఆధ్వర్యంలో పలుకలు బలపాలు పుస్తకాలు కూరగాయ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఇన్చార్జి రవిగాంజి, ట్యూటర్ శిభారాము తదితరులు పాల్గొన్నారు.