నవతెలంగాణ – పెద్దవంగర
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తొర్రూరు పార్టీ కార్యాలయంలో బీసీ తండా, ఎల్బీ తండా, చిన్నవంగర గ్రామాల్లోని నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నాయకులంతా సమన్వయంతో పని చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలుగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పాకనాటి రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.