
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం హుస్నాబాద్ లో బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, ప్రజలకు అండగా నిలవాలని అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నాయకులంతా సమన్వయంతో పని చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు పని చేయాలని కోరారు, అలాగే ఎన్నికల్లో ఒకరికి సర్పంచ్ గా అవకాశం వస్తే మరొకరికి ఎంపీటీసీ గా అవకాశం ఉంటుందని మరొకరికి పార్టీ పదవులలో న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్లీ బి ఆర్ ఎస్ జెండా ఎగరడం ఖాయమని సతీష్ కుమార్ అన్నారు, ఈ సందర్భంగా మహ్మదపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి , బొల్లి తిరుపతి లు కూచనపల్లి గ్రామానికి చెందిన గూల్ల చంద్రమౌళి ఇతరులు వివిధ పార్టీలనుండి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గంగం మదన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు