– ఫ్రీగా వచ్చే డబ్బులకు ఆశపడి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు.
– తొగుట ఎస్ఐ రవి కాంత్ రావు.
నవతెలంగాణ-తొగుట
టెక్నాలజీ బాగా పెరిగింది, టెక్నాలజీ మంచి గురిం చి అందిపుచ్చుకోవాలని, మనిషి మనుగడా టెక్నా లజీతో ముడిపడి ఉందని తొగుట ఎస్ఐ రవి కాంత్ రావు సూచించారు. బుధవారం సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం “కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాల తొగుట’ విద్యార్థినులకు ప్రస్తుతం జరుగు తున్న సైబర్ నేరాల గురించి, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ టెక్నాలజీ మంచి గురించి అంది పుచ్చుకోవాలని, మనిషి మనుగడా టెక్నాలజీతో ముడిపడి ఉందని, అదే సమయంలో సైబర్ నేరా లపై అప్రమత్తంగా ఉండాలని సూచంచారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే మెసేజ్ లకు రెస్పాం డ్ కావద్దని అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. జాబ్స్ ఉన్నాయి, ఆఫర్లు ఉన్నాయి, గిఫ్ట్ లు వస్తాయని, ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారని వాటిని అన్ని టినీ దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. మేము మిలిటరీ ఆఫీసర్లం, తక్కువ రేటుకు కార్లు, బైకులు అమ్ముతామని, జాబ్స్ ఇప్పిస్తామని రకరకాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వివరించారు. అన్నిటిపై అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటుగా ఉంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే గుర్తు చేశా రు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే బ్లూ కలర్ లింక్స్, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే రెస్పాం డ్ కావద్దని చెప్పారు. మన యొక్క బ్యాంకు డీటె యిల్స్, ఓటీపీ నెంబర్లు ఎవ్వరికీ చెప్పవద్దని అన్నా రు. సైబర్ నేరస్తుల వలలో చాలామంది ఉద్యో గస్తులు యువకులు, విద్యార్థినిలు మహిళలు మోసపోతున్నారని తెలిపారు. డబ్బులు ఊరికే రావు అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకొని మోసపోవద్దని అన్నారు. సైబర్ నేరాల నివారణ గురించి తెలంగాణ పోలీసులు సైబర్ సెల్ కో ఆర్డి నేషన్ సెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. మీకు తెలిసిన వారెవరైనా, మీ బంధువులు, స్నేహితులు సైబర్ నేరాల బారిన పడితే 24 గంటల లోపు 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సూచించా రు. సిద్దిపేట జిల్లాలో సైబర్ నేరాల నివారణ గురిం చి షీటీమ్ సిబ్బంది, పోలీస్ కళాబృందం కనువిప్పు అనే కార్యక్రమాల ద్వారా పోలీస్ అధికారులు సిబ్బంది ప్రతిరోజూ గ్రామాలలో అవగాహన కార్య క్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.