
నవతెలంగాణ – కుబీర్ :ఇటీవల గ్రామంలో ఉన్న ఆలయలో అధికంగా వరుస దొంగతనాలు జరరుగుతున్నా నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైంసా సబ్ డివిజనలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో గురువారం బైంసా ఎ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కుబీర్ మండలంలోని సోనారి గ్రామంలో కమ్యూనిటీ కంటక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఉదయం సమయంలో పోలీస్ బలగలతో గ్రామమలో ప్రతి ఇంటి ఇంటికి సోదలు నిర్వహించారు.ఇందులో గ్రామమలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న 50 ద్విచక్రా వాహనాలు ఒక్క ఆటో ను గుర్తించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో బైంసా ఏ ఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదల బారినపడి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. దింతో మద్యం తాగి వాహనాలు నడిపినట్టుళ్ళితే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.అదే విదంగా మైనరాలకు బైకులు కార్లు ఇచ్చినట్లుతే ముందుగా వారి తల్లిదండ్రులపై కేసు పెట్టడతామనారు అదే విదంగా గ్రామంలో ఎవరైనా నిషేధిత గంజాయి రవాణా చేస్తునట్లు గాని విక్రహిస్తునట్లు తెల్సిన వెంటనే పోలిసులకు సమాచారం అందించాలన్నారు.ఎలాంటి సమాచారం లేకుండానే కొందరు 100 కు డైల్ చేయడం జరుగుతుందని అన్నారు.వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ముక్యంగా గ్రామమలో వరుస దొంగతనాలు జరుగుతున్నా విషయం అందరికి తెలిసిన విషయం కాబట్టి గ్రామంలో ప్రధాన విధుల గుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసువాలని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానమని అన్నారు.ఈ కార్యక్రమంలో బైంసా రూరల్ సి ఐ నైలు కుబీర్ ఎస్ ఐ రవీందర్ బైంసా కుంటలు మాలిక్, భాస్కర చారి, పోలీస్ సిబ్బంది గ్రామస్తుల తదితరులు ఉన్నారు ు