ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల అధికారి, ఆర్డీవో  బెన్ శలొం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
 ప్రతి ఒక్కరూ ఈవీఎం ల పైన అవగాహణ కలిగి ఉండాలనీ హుస్నాబాద్ ఎన్నికల అధికారి, ఆర్డీవో బెన్ శలొం అన్నారు. మంగళవారం సమగ్రత కార్యాలయంలో పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం 108 మందికి, సాయంత్రం100 మందికి శిక్షణ ఇచ్చినట్లు ఆర్డిఓ పేర్కొన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కాలగకుండా సమయం లోపల ఎన్నికలు ముగించాలని అన్నారు. ఏన్నికల నిర్వహణలో అన్ని ప్రోపార్మ్స్ పైన ఇవి ఎం ల పైన పూర్తీ అవగాహణ కలిగివుండేల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆర్ ఓ, పి ఓ బుక్కు ను ఒక్కటికి రెండు సార్లు పఠనం చేసి పూర్తి అవగాహణ కలిగి వుండాలని తెలిపారు.