ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలి

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని మెడికల్ అధికారి దివ్య ఆరోగ్య సిబ్బందికి తెలిపారు. మంగళవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి మాట్లాడుతూ ఈ నెలలో నిర్వహించే నులిపురుగుల దినోత్సవం, అడల్ట్ బిసిజి వ్యాక్సిన్ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. చిన్నారుల వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, మల్టీపర్పస్ సూపర్వైజర్ సువర్ణ, రాజమణి, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.