– కాంప్లెక్సు హెచ్.యం పి.హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా విద్యాశాఖ ప్రాధమిక స్థాయి విద్యార్ధుల కోసం రూపొందించిన ఎఫ్.ఎల్.ఎన్ బాల మేళా -2025 ను ప్రతి పాఠశాల లోనూ సమర్ధవంతంగా నిర్వహించాలని అశ్వారావుపేట జెడ్పీ హెచ్ ఎస్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్సు స్థాయి ప్రధానోపాధ్యాయులు తో నిర్వహించిన బాల మేళా సన్నాహక సమావేశంలో అమె ప్రసంగించారు.తరగతి గది లోపల,వెలుపల విద్యార్ధులు నేర్చుకున్న,సృష్టించిన,సాధించిన ప్రతి అంశాన్ని ప్రదర్శించడానికి ఈ బాల మేళా రూపొందించ బడింది అని ఇది విద్యార్ధుల ఎదుగుదలకు,కళాత్మక వ్యక్తీకరణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఫిబ్రవరి 4 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు కాంప్లెక్సు లోని ప్రతి ప్రాధమిక పాఠశాల లోను బాల మేళా నిర్వహించబడుతుంది అని, ఇందుకోసం తేదీల వారీగా షెడ్యూలును ఖరారు చేశామని అన్నారు. బాల మేళా ఉద్దేశ్యాన్ని,లక్ష్యాలను ప్రధానోపాధ్యాయులుకు వివరించారు.అనంతరం పాఠశాలలో మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బాల మేళా కాంప్లెక్సు ఆర్.పి సత్యనారాయణ, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.