కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదు..

Do not discriminate against leprosy patients.నవతెలంగాణ – భిక్కనూర్
కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, కుటుంబ సభ్యుల లాగా భావించాలని గురువారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ అధికారి దివ్య మెడికల్ సిబ్బంది ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రేమతో చికిత్స చేయాలని, వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స చేయాలని సూచించారు. అలాగే మండలంలోని బస్వాపూర్, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి, జంగంపల్లి, ఆయా గ్రామాలలో, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది చైతన్య, సతీష్, ఆరోగ్య సిబ్బంది, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.