నీటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలి..

Steps should be taken without water problems.– జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు
నవతెలంగాణ – రాజంపేట్ ( భిక్కనూర్ )
రాజంపేట మండలంలో ప్రజల నీటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. శనివారం రాజంపేట పట్టణంలోని గ్రామపంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు పరిశీలించి ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది చేత ట్యాంకులు శుభ్రం చేయించాలని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర బోరుబావులను వాటర్ ట్యాంకులకు కలపాలని తెలిపారు. ట్యాంకుల సమీపంలో మురికి నీరు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని, ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘురాం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రజిత, ఇంట్రా ఏ ఈ శిరీష, పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.