గతంలో ఇచ్చిన ఇండ్ల సర్టిఫికెట్లు ఉన్నవారికి కబ్జా చూపించండి

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్‌
నవతెలంగాణ-కందుకూరు
గతంలో ఇచ్చిన ఇండ్ల సర్టిఫికెట్‌ ఉన్నవారందరికీ ఇండ్ల స్థలాల కబ్జా చూపించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్‌ కోరా రు. శనివారం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుడ్డీరపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కందుకూరు ఆర్డీవో సూరజ్‌కుమార్‌కు ఇండ్ల స్థలాల కబ్జా చూపించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇండ్ల స్థలా లకు కబ్జా చూపించాలని గతంలో అనేక ఆందోళనలను, ధర్నాలు, రాస్తారో కోలు, ర్యాలీలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేసిన పట్టించుకోలేదని వాపోయారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇండ్ల స్థలాల సమస్యల విషయంలో కబ్జా చూపించాలని ఒత్తిడి తెచ్చిన పట్టించుకోలేదని విమర్శిం చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం పాల నపై దృష్టి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు మండల కేంద్రం కొత్తగూడ రెవిన్యూ, కందుకూరు రెవిన్యూలో నిరుపేదలకు ఇచ్చినట్లు వంటి ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ కబ్జాలు చూయించి పేద ప్రజలకు న్యాయం చే యాలని కోరారు. ఆర్డీవో సూరజ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించి సమస్య లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు అంకగాళ్ల కుమార్‌, సీఐ టీయూ సంఘం మండల కన్వీనర్‌ బుట్టి బాల్‌రాజు, శేఖర్‌, గాదె సత్తయ్య, మహిళలు పాల్గొన్నారు.