పందుల దొడ్లకు స్థలం చూపించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సభ్యులు దాసరి పాండు
నవ తెలంగాణ -బొమ్మలరామారం
మండల కేంద్రంలో ఎరుకల కుల కుటుంబాలకు పందులు దొడ్లకు స్థలాలు చూపించి వారిని ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎరుకల కులాల దొడ్లులకు స్టాలాలు చూపించాలని ఎమ్మార్వోకు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ పందులను వత్తిగా చేసుకుని కుటుంబ జీవనం గడుపుతున్న వారి పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు కక్ష ధోరణి పాటిస్తున్నారన్నారు. పందులను తీసేయాలని దౌర్జన్యంగా వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విధానం వెంటనే ఉపసంహరించుకోవాలని కులానికి సంబంధించిన కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని అధికారులకు చెప్పిన గాని నిర్లక్ష్యం వహిస్తున్నారని చిత్తశుద్ధితో వెంటనే ఎరుకలు కులాలకు సంబంధించిన పందులకు ప్రభుత్వం స్థలాలు చూపించి ఆ కుటుంబాలను ఆదుకోవాలనిడిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మం డల కార్యదర్శి ర్యకలశ్రీశైలం ,నాయకులు యాదయ్యయ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.