
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని సోమూరు గ్రామ శివారు ప్రాంతానికి రహదారి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆ గ్రామ ప్రజలు వ్యవసాయ రైతులు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కు విన్నవించగా సోమూర్ గ్రామ శివారు ప్రాంతానికి రహదారులు ఉండకపోవడం ఏమిటని గ్రామ శివారు ప్రాంతా టిఫన్ ప్రకారం వ్యవసాయదారులకు రహదారులు చూపించాలని ఎమ్మెల్యే తాసిల్దార్ కు రాసిన కాపీని సోమూరు గ్రామస్తులు ధన్నూర్ గ్రామ పెద్దలు దేవిదాస్ పటేల్ ఆధ్వర్యంలో గురువారం నాడు మద్నూర్ మండల కేంద్రానికి ఆ గ్రామ వ్యవసాయదారులు తరలివచ్చి తాసిల్దార్ ఎండి ముజీబ్ కు ఎమ్మెల్యే కాపీని అందజేశారు ఎమ్మెల్యే కృషితో తమకు శివారు ప్రాంత రహదారులు అధికారులు చూపిస్తే వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయని ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎమ్మెల్యే కృషి మూలంగా పరిష్కారం కోసం తాసిల్దార్ సానుకూలంగా స్పందించారని సోమూరు గ్రామ రైతులు గ్రామస్తులు దన్నూరు గ్రామ పెద్దలు తెలిపారు