– సామాన్యులకు అందని ద్రాక్షగా కేంద్ర బడ్జెట్..
– జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ (ఎస్ సి) విభాగం చైర్మన్ దండు రమేష్
నవతెలంగాణ : భూపాలపల్లి /మలహార్ రావు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ ప్రజలకు అంకెల గారడితో మాయ చేసి చూపించారని, ఆశల పల్లకిలో ఉరేగించి ఉసూరుమనిపించారని జిల్లా చైర్మన్ దండు రమేష్ విమర్శించారు. బడ్జెట్ పెంచి చూపిస్తున్నప్పటికి లక్ష కోట్లు వడ్డీ చెల్లింపులకు చూపడం దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తుందన్నారు. పేదరికం నుండి 25 కోట్ల మందిని బయటకు తీసుకువస్తే మన దేశం ఆకలి సూచికలో ప్రంపంచంలో 102వ స్థానం నుండి 107వ స్థానానికి ఎలా దిగజారిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పాలన్నారు. తగ్గుతున్న తలసరి ఆదాయం దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలన్నారు, దేశంలో 30 కోట్ల మంది యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారని వారి ఉపాధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదని, దేశ వ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కోట్లాదిమంది ప్రజలకు నేటికి కనీస సౌకర్యాలు కల్పించడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు, పేద ప్రజల కష్టార్జితం ద్వారా సంపాదించిన దేశ సంపదను కార్పొరేటర్లకు,సంపన్నులకు కట్టబెడుతుందన్నారు, 11 సంవత్సరాల బిజెపి పాలనలో పేదల సంక్షేమంపై సీతకన్ను,విద్య వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది,వేతన జీవులకు సంఘటిత,అసంఘటిత కార్మిక వర్గానికి తీవ్ర నిరాశ మిగిలిందన్నారు. అవినీతి నిర్ములించామని చెప్పుతున్నప్పటికి దేశంలో అవినీతి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే సూచిస్తున్నాయి, బిజెపి పాలన దేశాన్ని దివాళా తీయించిన యుగమని అభివర్ణించారు. ఈ బడ్జెట్ అన్ని రాష్టలను కలుపుకుని ఏర్పడ్డ భారతదేశ బడ్జెట్ కానీ వార్షిక బడ్జెట్ లో బిజెపి(ఎన్డీఏ) పాలిత రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మొండిచేయి ఇవ్వడం దారుణం అన్నార. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీ లను అందించారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అయినా ఈ బడ్జెట్ లో తెలంగాణకు ఒరిగింది ఏమి లేదని విమర్శించారు, ఈ బడ్జెట్ దేశప్రజాలను నిరాశ పర్చిందని,బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంతో పాటు,దేశం దివాళా తెస్తుందని ఆయన వ్యాఖ్యానించారు