కొత్త ప్రపంచాన్ని చూపించే క..

Showing a new world..హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ నయన్‌ సారిక, తన్వీ రామ్‌ కథానాయికలు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. నిర్మాత చింతా గోపాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. ట్రైలర్‌ ఎంత బాగుందో సినిమా అంతకంటే చాలా బాగుంటుంది’ అని తెలిపారు. దర్శకుడు సుజీత్‌ మాట్లాడుతూ,’సినిమా ట్రైలర్‌కి నాలుగు రెట్లు పవర్‌ ఫుల్‌గా ఉంటుంది. కిరణ్‌ని ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాం’ అని అన్నారు. హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘చాలా కొత్త కంటెంట్‌తో సినిమా చేశాను. గతంలో నా సినిమాలు అన్ని విషయాల్లో బాగున్నా కంటెంట్‌ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది అనే కామెంట్స్‌ వచ్చాయి. అందుకే కంటెంట్‌ మీద శ్రద్ధ తీసుకుని ఈ సినిమా చేశాం. ఫస్ట్‌ సీన్‌ నుంచి లాస్ట్‌ సీన్‌ దాకా కొత్తగా ప్రయత్నించాం. స్క్రీన్‌ ప్లే యూనిక్‌గా ఉంటుంది. ఇందులో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. సినిమా చూస్తున్నంత సేపూ హ్యాపీగా ఫీలవుతారు. దీపావళి సందర్భంగా వస్తున్న ఈ సినిమాని సకుటుంబంతో చూడండి’ అని చెప్పారు.