గాగీల్లపూర్ లో శ్రమదానం…

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో సర్పంచ్ అన్నాడీ సత్యనారాయణ అధ్వర్యంలో ప్రత్యేక శ్రమదానం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో పాఠశాల నుండి రైతు వేదిక వరకు రోడ్డుకిరువైపుల చెత్తను తొలగించినట్టు సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు. ఎంపీఓ విష్ణు వర్దన్, ఎంపీటీసీ కొమిరే మల్లేశం,ఉప సర్పంచ్ బామండ్ల తిరుమల,పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పీల్డ్ అసిస్టెంట్ బుర్ర రాములు,ఆశా కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.