బీసీ ఆజాది యూత్ మండల అధ్యక్షులుగా మూదం శ్రావణ్ కుమార పటేల్         

నవతెలంగాణ ధర్మారం :  మండలంలోని దొంగతుర్తి గ్రామానికి చెందిన మాదంశ్రావణ్ కుమార్ బిసి ఆజాది యూత్ ఫెడరేషన్ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల కేంద్రంలో శనివారం రోజూన బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కనీ సంజయ్ కుమార్ జిల్లా కన్వీనర్ డారి బీరయ్యల ఆధ్వర్యంలో సమావేశమైన అన్ని బీసీ కుల సఝఘాల ప్రతినిధులు కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దొంగతుర్తి గ్రామానికి చెందిన మూదం శ్రావణ్ కుమార్ పటేల్ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన తుమ్మల తిరుపతి యాదవ్  ప్రధాన కార్యదర్శిగా, చామనపల్లి గ్రామానికి చెందిన గౌడ గోవిందునేత ఉపాధ్యక్షులుగా బుచ్చయ్యపల్లికి గ్రామానికి చెందిన బొంగాని తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ధర్మారం గ్రామానికి కచెందిన మెడవేని వినోద్ ముదిరాజ్ కోశాధికారిగా, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కొడిశెర్ల రాజు కార్యనిర్వహక కార్యదర్శిగా ఏకగ్లీవంగా ఎన్నికైనట్లు జాతీయ అద్యక్షులు దక్కని సంజయ్ కుమార్ వివరించారు