ఘనంగా శ్రీ రామ నవమి ఉత్సవం

నవతెలంగాణ – మాక్లూర్

మండలంలోని వివిధ గ్రామాల్లో శ్రీ సీతా రాముల కళ్యాణం ఘనంగా బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ లక్ష్మణ సహిత సీతారామాంజనేయ ఆలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఆలూరు మండలంలోని డికంపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో జిల్లా జెడ్పీ చైర్మన్ డీ. విఠల్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.