హైదరాబాద్ : ఫైనాన్సీయల్ సొల్యూషన్స్ సంస్థ శ్రేస్తాఫిన్వెస్ట్ బోర్డు ఆగస్ట్ 19న భేటీ కానున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో నిధుల సమీకరణ ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు పేర్కొంది. ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టేబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఇతర సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా నిధులు పొందే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు, లీగల్ అడ్వైజర్లను నియమించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. దీనికి పలు రెగ్యూలేటరీ అనుమతులు పొందాల్సి ఉంటుంది.