పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఏడవ తరగతి చెందిన టి.సాత్విక్ శనివారం రోజు మహబూబ్ నగర్ లో జరిగిన 68 వ ఎస్ జి ఎఫ్ ఐ జాతీయస్థాయి అండర్ 14 రగ్బి ఆటలో జాతీయస్థాయి ఎంపికయ్యారు .ఈ సందర్భంగా బుధవారం పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు చదువులో భాగమని, అంతేకాకుండా ఆటల వలన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అని అన్నారు. జాతీయస్థాయిలో ఎంపికైన విద్యార్థిని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పి ఈ టి తదితరులు పాల్గొన్నారు.