నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 11న గురువారం ఉదయం 11 గంటలకు మద్నూర్ మండలంలోని మేనూర్ శ్రీ హనుమాన్ దేవస్థానం యొక్క భూములు కౌలు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఒక ప్రకటనలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ అలాగే సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ దేవస్థానానికి చెందిన రెండు సర్వే నెంబర్లు కలిసి మొత్తం 14 ఎకరాల 16 గుంటలు భూమి ఉన్నట్లు ఈ భూమికి కౌలు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఆ రక్తంలో పేర్కొన్నారు. వేలంపాట లో పాల్గొనే వారు ముందుగా మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందని వేలంపాటలో పాల్గొనేవారు. ఈ దేవస్థానానికి ఎలాంటి బకాయిలు ఉండకూడదని తెలియజేశారు. బకాయి ఉన్నవారు వేలం పాటలో పాల్గొనడానికి అనర్హులని తెలియజేశారు. ఈ భూములు కౌలు పొందడానికి 11-7-2024 నుండి10-7-2025 వరకు సాగు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో సూచించారు. వేలంపాటలో పాల్గొని దేవస్థానం భూమి కౌలు సాధించుకున్న వ్యక్తులు వెంటనే1/2 వంతు పైకము వెంటనే చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. ఈనెల 11న దేవస్థానం భూమి కౌలు వేలంపాట మేనూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించబడుతుందని తెలిపారు. దేవస్థానం భూములు కౌలు పొందడానికి వ్యవసాయదారులు పెద్ద సంఖ్యలు హాజరుకావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కోరారు.