అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

నవతెలంగాణ- ఆర్మూర్

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఆర్ డి ఓ వినోద్ కుమార్ అన్నారు. పట్టణంలోని లోని శ్రీ భాషిత పాఠశాలలో బుధవారం క్షత్రియ ఫంక్షన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ అంగరంగ వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కృష్ణుడు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద పండుగను  అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు పాఠశాల కరస్పాండెంట్ అయినా పోలపల్లి సుందర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ హాస్పిటల్ వైద్యులు బాను రామగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు  భగవద్గీత నేర్చుకొని అందులోని శ్రీకృష్ణుని విశిష్టత గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్న చిన్న పిల్లలు గోపిక కృష్ణుల వేషధారణతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే వేడుకలను చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్  మాట్లాడుతూ కృష్ణాష్టమి మా పిల్లలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు.ఈ  వేడుకలలో తల్లిదండ్రులు విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.