సేవే మార్గంగా శ్రీ కృష్ణా యూత్‌ ముందడుగు

– కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జగదీశ్వర్‌ గౌడ్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శ్రీకృష్ణ యూత్‌, జగదీశ్‌ యువ సంఘటన సభ్యులు వివేక్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం శేరిలింగంపల్లి కాం గ్రెస్‌ ఇన్‌చార్జ వి.జగదీశ్వర్‌ గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్‌ క్యాంపునకు విశేష్‌ స్పం దన లభించిందని జగదీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం మమత హాస్పిటల్స్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్‌ క్యాంపులో సుమారు 1200 మందికి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల పరీక్షల అనంతరం 100 మందికి శాస్త్ర చికిత్సలు, 28 మంది గర్భవతి మహిళలకు కాన్పు వరకు ఉచితంగా వైద్య సేవ లు అందించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అందు లో భాగంగా మంగళవారం మమత హాస్పిటల్స్‌లో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్ర జలను పరామర్శించి, అవసరం ఉన్న అన్ని రకాల వైద్య సేవలు నియోజకవర్గ ప్రజలకు అందించాలని, అందుకు మా వంతు సహకారం ఉంటుందని మమత హాస్పిటల్స్‌ సూపరింటెండెంట్‌ను కోరారు. అయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియో జకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యమ ని, శ్రీకృష్ణ యూత్‌ సభ్యులు ఎప్పుడు ఇ లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు.