
శ్రీ లక్ష్మీనరసింహస్వామి గ్రామ దేవాలయములోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూలమూర్తులకు కీర్తిశేషులు పాత కిష్టయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు పాత లక్ష్మీరాజం ,పండరి, రమేష్, అశోక్ కుటుంబ సభ్యులందరూ కలిపి సుమారు కిలో వెండితో స్వామివారికి అమ్మవారికి రెండు వెండి కిరీటాలు తయారు చేయించి పూజా కార్యక్రమాలు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. విగ్రహా మూర్తులకు వెండి కెరటాలు చేయించిన దాతలను ఆలయము తరఫున సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, ఆలయ అర్చకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.