
– మంత్రి రాజ సమ్మయ్య విజ్ఞప్తి
నవతెలంగాణ-మల్హర్ రావు : తెలంగాణ ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు మంత్రి రాజ సమ్మయ్య ప్రభుత్వానికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దుద్దిళ్ల కాంగ్రెస్ పార్టీలో అందరితో కలుపుకోరుగా వ్యవహరిస్తారన్నారు.దివంగత నేత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మరణానంతరం దిక్కుతోచని మంథని నియోజకవర్గం ప్రజలు ఉంటే వారికి రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆయన సోదరుడు శ్రీనుబాబు అందుబాటులో ఉంటు సేవాలందిస్తూ, అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారని తెలిపారు. మంథని నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రి ఆశయ సాధన కొరకు కృషి చేస్తున్న యువ నాయకుడు శీనుబాబుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తే అధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.