– పంజాబ్ తరఫున ఆడేందుకు అంగీకారం
ముంబయి: ప్రతిష్టాత్మక రంజీట్రోఫీ సీజన్-2025లో శుభ్‌మన్ గిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ ఏడాది జరిగే రంజీట్రోఫీలో పంజాబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో పంజాబ్-కర్ణాటక మధ్య జరిగే రంజీట్రోఫీ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు. శుభ్‌మన్ గిల్ చివరిసారిగా 2022లో మధ్యప్రదేశ్ తరఫున రంజీట్రోఫీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్ ఆడి ఆ తర్వాత దేశవాళీ సీజన్ ఆడిన దాఖలాలు లేవు. పంజాబ్ జట్టు రంజీట్రోఫీకి ప్రకటించిన 15మంది ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ పేరు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. జనవరి 23నుంచి ఇరుజట్ల మధ్య రంజీట్రోఫీ మ్యాచ్ జరగనుంది.
పంజాబ్ జట్టు: శుభ్ మన్ గిల్, విశ్వనాథ్, అన్మోల్‌ప్రీత్, పక్‌రాజ్ మన్, అన్మోల్ మల్హోత్రా, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, ఇందెర్ సింగ్, సుఖ్‌దీప్ బజ్వా, గుర్‌నూర్ బ్రార్, రమణ్‌దీప్ సింగ్, సహజ్ ధావన్, కున్వార్ కుక్రేజా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాహిల్.