వేములవాడ విలీన గ్రామం శాత్రాజ్ పల్లి లో గత మూడు రోజుల క్రితం ఓ శునకం బావిలో పడింది. శనివారం శునకని బయటకు తీయడానికి స్థానికులు ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని శునకాన్ని బయటకు తీసి సంబంధించిన యజమానికి అప్పజెప్పారు. శునకం యజమాని ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఫైర్ సిబ్బంది ఎస్ ఎఫ్ ఓ కమలాకర్, రాజేంద్రప్రసాద్, శంకర్, యాదయ్య, రాజేశం, జీవన్ రెడ్డి ఉన్నారు.