శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివి 

– జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
హిందూ జాతీయవాద నాయకులు, హైందవ ఏకీకరణకు తోడ్పడిన ఉద్యమ నేత భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు ముడితనపెల్లి ప్రభాకర్ అన్నారు. శనివారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మండల కేంద్రమైన తాడిచర్ల లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారతీయ జన సంఘ్ ను స్థాపించి హైందవ ఏకీకరణకు తోడ్పడిన మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ నహి చెలేంగే అంటూ జాతీని జాగృతం చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయులు అని కొనియాడారు. అనంతరం ప్రదాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జీ మల్లెవేణి రమేష్, బూత్ అధ్యక్షులు తోకల గట్టయ్య, అంగజాల సంజీవ్, బీజేపీ నాయకులు కోట నవీన్, ఊదరి మహేష్, నిషాన్, చిగురు సంజీవ్, కుమార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.