
మండల తహసీల్దార్ గా ఏ శ్యాంసుందర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన గుంజల శంకర్ పదవీకాలం ముగియడంతో జైనథ్ తహసీల్దార్‌గా పనిచేసిన శ్యాంసుందర్ బదిలీపై ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన తహసిల్దార్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహాసిల్దార్ హీరలాల్, సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి, ఆర్ఐలు శ్యాంసుందర్ రెడ్డి, నర్సింగ్, జూనియర్ అసిస్టెంట్లు కరుణాకర్, మెహరాజ్, సంజీవ్ కుమార్, స్రవంతి, ఆపరేటర్ ఆశన్న, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.