సిబ్బంది వేధింపులు, వివక్ష తాళలేక ఎస్ఐ ఆత్మహత్యాయత్నం..

– దళిత సంఘాలు ఆద్వర్యంలో 
– రాస్తారోకో,స్టేషన్ ముట్టడి..
– వినతి పత్రం అందజేత…
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీఐ,మరో నలుగురు సిబ్బంది కుల వివక్ష,వృత్తి సహాయ నిరాకరణ,వేదింపులు తాళలేక గత నెల 30 వ తేదీ ఆదివారం మహబూబాబాద్ సమీపంలో గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్.ఐ శ్రీరాముల శ్రీనివాస్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఆదివారం మధ్యరాత్రి తుదిశ్వాస విడిచారు. 2014 బ్యాచ్ కు చెందిన ఎస్.ఐ శ్రీను వరంగల్ జిల్లా,నల్లబెల్లి మండలం నారక్కపేట వాసి.ఈయన కు తల్లి రాజీరమ్మ,సోదరులు,భార్య క్రిష్ణ వేణి,పాపం,బాబు ఉన్నారు. శ్రీను చివరిగా మాట్లాడుతూ సీఐ జితేందర్,సిబ్బంది సన్యాసి నాయుడు,శుబాని,శేఖర్,శివ నాగరాజు  ల వేధింపులే కారణం అంటూ చెప్పాడు. ఎస్ఐ శ్రీను మృతి విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాల ఆధ్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన మూడు రోడ్ల ప్రధాన కూడలి లో బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ను ముట్టడించి సంబంధిత సిబ్బందిని విధులు నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంఛార్జి సీఐ కరుణాకర్ కు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కలపాల మంగ రాజు,తగరం రాంబాబు,ముద్దా పిచ్చయ్య, కొలికిపోగు వెంకటేశ్వరరావు,జక్కుల రాంబాబు,కేశవ్ గౌడ్,నార్లపాటి మహేష్,తగరం రాం నివాస్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ జితేందర్, నలుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు:
తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణం సీఐ జితేందర్,సన్యాసి నాయడు,శుభాని,శేఖర్,శివ నాగరాజు లే కారణం అంటు ఎస్.ఐ శ్రీను సతీమణి క్రిష్ణ వేణి సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో మూడు రోజులు క్రితం పిర్యాదు చేసారు.అక్కడి పోలీస్ లు జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి మహబూబాబాద్ పోలీస్ లకు పంపారు.దీంతో సీ.ఐ జితేందర్ పై ఎస్.సి అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాకుండా ఆయన్ను అశ్వారావుపేట నుండి బదిలీ చేసి వరంగల్ ఐజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేసారు.మరో నలుగురి సిబ్బందిని ఎస్పీ కార్యాలయం కొత్తగూడెం కు అటాచ్డ్ చేసారు.
అశ్వారావుపేట కు ఇంచార్జి సీఐ గా కరుణాకర్ వ్యవహరిస్తున్నారు.
ఎస్.ఐ శ్రీను మేనత్త రాజమ్మ మృతి :
ఎస్.ఐ శ్రీను మరణ సమాచారం తెలిసి గుండెపోటుతో తన మేనత్త మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నతాధికారి,సిబ్బంది వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్సై శ్రీనివాస్ మరణవార్త విని ఆయన మేనత్త దార రాజమ్మ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి కి చెందిన రాజమ్మ తన మేనల్లుడు శ్రీనివాస్ మరణ వార్త విని ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజమ్మ కు భర్త ఐలయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎస్.ఐ మృతి విషాదకరం – ఎమ్మెల్యే ఆదినారాయణ
ఎస్.ఐ శ్రీను మృతి విషాదకరం అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయం లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆయన మృతి సంతాపం ప్రకటించి,కుటుంబానికి సానుభూతి తెలిపారు.ప్రభుత్వం ఎస్ఐ కుటుంబాన్ని ఆదుకుంటుందని తెలిపారు.